Jagan: జగన్ పాదయాత్ర.. నేటి షెడ్యూల్ ఇదే!

  • ఉదయం 8:30  నిమిషాలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ సమాధి వద్దకు జగన్
  • 9 గంటలకు బహిరంగ సభావేదిక వద్దకు
  • 1.00 గంటలకు వీరన్నగట్టు పల్లె వద్ద లంచ్, విరామం
  • వేంపల్లె క్రాస్ వద్దనున్న బ్రిడ్జి సమీపంలో నేటి పాదయాత్ర ముగింపు
  • తొలిరోజు పాదయాత్ర 8.9 కిలోమీటర్లు

వైఎస్సార్సీపీ అధినేత జగన్ చేపట్టిన పాదయాత్ర నేటి ఉదయం 8.30 గంటలకు ప్రారంభం కానుంది. ఉదయం 8:30 నిమిషాలకు జగన్ కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలోని ఆయన తండ్రి సమాధి వద్దకు చేరుకుని నివాళులర్పిస్తారు. అనంతరం పాదయాత్ర అధికారికంగా ప్రారంభమవుతుంది.

అక్కడి నుంచి కాస్త దూరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికకు 9 గంటలకు చేరుకుంటారు. అక్కడ 9.45 వరకు ఆయన ప్రసంగం కొనసాగనుంది. అనంతరం ప్రజాసంకల్ప పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడి నుంచి ఆయన మధ్యాహ్నం 1.00 గంటకు వీరన్నగట్టుపల్లెకు చేరుకుని, అక్కడ భోజనం చేసి 3 గంటల వరకు విరామం తీసుకుంటారు.

అనంతరం అక్కడి నుంచి వేంపల్లె క్రాస్‌ వద్ద ఉన్న బ్రిడ్జి సమీపం వరకు పాదయాత్ర చేస్తారు. దీంతో నేటి పాదయాత్ర పూర్తవుతుంది. ఈ విధంగా ఆయన తొలిరోజు మొత్తం 8.9 కిలోమీటర్లు నడవనున్నారు. యాత్ర ముగించి, అక్కడే రాత్రికి బస చేస్తారు. తొలిరోజు పాదయాత్రలో వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా కలిసి 30 మంది హాజరవుతారని, పార్టీ శ్రేణులు భారీగా తరలివస్తాయని వైఎస్సార్సీపీ అంచనా వేస్తోంది.

Jagan
YSRCP
padayatra
first day
  • Loading...

More Telugu News