gurmeet ram rahim singh: ఆ గాడిదల పేర్లు గుర్మీత్ రాంరహీం సింగ్, హనీప్రీత్ సింగ్.. సంతలో విక్రయం!

  • మధ్యప్రదేశ్‌ లోని ఉజ్జయినిలో జరిగే గాడిదల సంతలో గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్, హనీప్రీత్‌ సింగ్‌ లకు తీవ్ర అవమానం
  • గాడిదలకు గుర్మీత్, హనీప్రీత్ ల పేర్లు పెట్టిన యజమాని ‌
  • 11,000 రూపాయలకు విక్రయం

హర్యానాలోని సిర్సా జైల్లో శిక్ష అనుభవిస్తున్న డేరా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్, ఆయన దత్తపుత్రిక హనీప్రీత్‌ సింగ్‌ లకు మధ్యప్రదేశ్‌ లోని ఉజ్జయినిలో జరిగే గాడిదల సంతలో తీవ్ర అవమానం జరిగింది. ఈ సంతలో రెండు గాడిదలను అమ్మేందుకు రాజస్థాన్ కు చెందిన హరిఓం ప్రజాపత్‌ వచ్చారు.

ఆయన తన రెండు గాడిదలకు గుర్మీత్‌ సింగ్, హనీప్రీత్‌ అనే పేర్లు పెట్టుకున్నాడు. వీటిని 11,000 రూపాయలకు విక్రయించాడు. చేసిన తప్పుకు శిక్ష తప్పదని గుర్తు చేసేందుకే తన గాడిదలకు గుర్మీత్‌ సింగ్, హనీప్రీత్‌ ల పేర్లు పెట్టానని ఆయన తెలిపాడు. వాస్తవానికి వాటిని 20,000 రూపాయలకు విక్రయించాలని భావించినా డిమాండ్ రాకపోవడంతో 11,000 రూపాయలకు విక్రయించానని చెప్పాడు.

gurmeet ram rahim singh
hanipreet singh
donkeys
up
rajasthan
  • Loading...

More Telugu News