Narendra Modi: మోదీ నియోజకవర్గంలో బీజేపీకి చేదు అనుభవం

  • విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీ ఓటమి
  • గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థి
  • మహాత్మాగాంధీ కాశీ విద్యాపీఠ్ యూనివర్శిటీ ఎన్నికల్లో చేదు ఫలితం

బీజేపీకి షాక్ తగిలింది. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఉన్న ఓ యూనివర్శిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో బీజేపీ అనుబంధ సంస్థ ఏబీవీపీ ఘోర పరాజయం పొందింది. వివరాల్లోకి వెళ్తే, మహాత్మాగాంధీ కాశీ విద్యాపీఠ్ యూనివర్శిటీ ఎన్నికలను విద్యార్థి సంఘాలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుంటాయి.

ఈ ఎన్నికల్లో ఏబీవీపీ తరపున వాల్మీకి ఉపాధ్యాయ బరిలోకి దిగగా, సమాజ్ వాదీ ఛాత్ర సభ నుంచి రాహుల్ దుబే బరిలోకి దిగాల్సి ఉంది. అయితే, చివరి క్షణంలో అతనికి టికెట్ దక్కకపోవడంతో, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు. ఎన్నికల్లో వెయ్యికి పైగా ఓట్ల తేడాతో రాహుల్ గెలుపొందాడు. వాల్మీకిపై పలు ఆరోపణలు ఉండటం, రాహుల్ అనుచరులపై దాడి చేశాడన్న కేసు ఉండటం అతనికి ప్రతికూలంగా మారింది.

Narendra Modi
varanasi
mahatma gandhi kasi vidyapeet university
  • Loading...

More Telugu News