Errabelli: ఈ ఆటలో ఎర్రబెల్లి 30 బహుమతులు సాధించారట!

  • చదువుకునే రోజుల్లో కబడ్డీ ఆడేవాడిని
  • ఇప్పుడు క్రీడాకారులు కబడ్డీ వైపు మళ్లుతున్నారు
  • కబడ్డీకి ప్రపంచ స్థాయి గుర్తింపు వస్తుంది

టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో కబడ్డీ ఎక్కువగా ఆడేవారట. కబడ్డీలో దాదాపు 30 బహుమతులు గెలుచుకున్నానని ఆయన తెలిపారు. రాయపర్తిలో ఆయన నిర్వహిస్తున్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిన్నటి నుంచి 17వ అంతర్ జోనల్, వరంగల్ స్థాయి జూనియర్ కబడ్డీ బాలబాలికల ఛాంపియన్ షిప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ ఛాంపియన్ షిప్ పోటీలను నిన్న ఎర్రబెల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పై విషయాలను వెల్లడించారు. క్రికెట్ ప్రపంచంలో మునిగి తేలుతున్న క్రీడాకారుల దృష్టి ప్రస్తుతం కబడ్డీపైకి మళ్లుతోందని ఎర్రబెల్లి అన్నారు. రాబోయే రాజుల్లో కబడ్డీకి ప్రపంచ స్థాయి గుర్తింపు లభిస్తుందని ఆకాంక్షించారు.

Errabelli
kabaddi
TRS
errabelli charitable trust
  • Loading...

More Telugu News