Narendra Modi: చేతకాకపోతే దిగిపోండి: మోదీపై మండిపడ్డ రాహుల్

  • ధరలను తగ్గించండి.. లేకపోతే పదవిని వదిలేయండి
  • ఇచ్చిన హామీలను నెరవేర్చండి
  • ట్విట్టర్ లో మోదీ ఘాటు వ్యాఖ్యలు

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పెరిగిపోతున్న వంటగ్యాస్, కూరగాయల ధరలపై ట్విట్టర్ ద్వారా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మీకు చేతనయితే ధరలను తగ్గించండి... చేతకాకపోతే ప్రధాని పదవి నుంచి దిగిపోండి' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమరు ఇచ్చిన హామీలు తమకు గుర్తున్నాయా... ఇప్పటికైనా వాటిని నెరవేర్చే ప్రయత్నం చేయండి అంటూ మండిపడ్డారు. గత 16 నెలల కాలంలో వంటగ్యాస్ ధరలు 19 సార్లు పెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. 

Narendra Modi
rahul gandhi
indian prime minister
congress
  • Error fetching data: Network response was not ok

More Telugu News