Kamal Haasan: హింసకు పాల్పడేవారు ఉగ్రవాదులు కాకపోతే మరెవరు?: కమల్ కు అరవిందస్వామి మద్దతు

  • హిందూ ఉగ్రవాదంపై కమల్ వ్యాఖ్యలు
  • దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం
  • కమల్ కు మద్దతుగా అరవిందస్వామి

దేశంలో హిందూ ఉగ్రవాదం పెరిగిపోయిందంటూ విలక్షణ నటుడు కమలహాస్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, కమల్ ను కాల్చి చంపినా తప్పులేదంటూ అఖిల భారతీయ హిందూ మహాసభ ఉపాధ్యక్షుడు అశోక్ శర్మ తీవ్ర వ్యాఖ్యలు కూడ చేశారు. కమల్ పై క్రిమినల్, పరువునష్టం కేసు పెట్టాలన్న పిటిషన్ ను వారణాసి కోర్టు విచారణకు కూడా స్వీకరించింది.

ఈ క్రమంలో కమల్ కు ప్రముఖ సినీ నటుడు అరవిందస్వామి మద్దతుగా నిలిచారు. చట్ట విరుద్ధంగా బెదిరింపులకు, హింసకు పాల్పడేవారిని ఉగ్రవాదులు కాక మరేమని పిలుస్తారని ఆయన ప్రశ్నించారు. 'మెర్సల్' సినిమాకు కూడా మద్దతు పలికారు. ఓ తమిళ మేగజీన్ కు రాసిన కాలమ్ లో ఆయన ఈ మేరకు తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.  

  • Error fetching data: Network response was not ok

More Telugu News