wall mart: భారత్‌లో మరిన్ని వాల్‌మార్ట్ స్టోర్లు!
- అమెరికాకు చెందిన రీటైల్ దిగ్గజం వాల్‌మార్ట్
- ‘బెస్ట్‌ప్రైస్’ పేరుతో భారత్‌లో ఇప్పటివరకు మొత్తం 21స్టోర్లు
- మరో 30 స్టోర్లను నిర్మించడానికి కసరత్తులు
- మహారాష్ట్రలో 15స్టోర్లు నిర్మించేందుకు రూ.900 కోట్ల పెట్టుబడి
అమెరికాకు చెందిన రీటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ భారత్‌లో తమ వ్యాపారాన్ని మరింత విస్తరించుకునే ప్రయత్నం చేస్తోంది. వాల్‌మార్ట్‌కు ‘బెస్ట్‌ప్రైస్’ పేరుతో భారత్‌లో ఇప్పటివరకు మొత్తం 21 స్టోర్లు ఉండగా, మరో 30 స్టోర్లను నిర్మించడానికి కసరత్తులు ప్రారంభించింది. మహారాష్ట్రలోని బీవండీలో ఒక ఫుల్‌ఫిల్ సెంటర్‌ను ఏర్పాటు చేయగా మరో ఫుల్‌ఫిల్ సెంటర్‌ను లక్నోకు సమీపంలో నిర్మించనుంది.
ఇప్పటికే 19 నుంచి 20 స్టోర్లకు సంబంధించిన నిర్మాణాలపై ఒప్పందాలు జరిగిపోయాయి. 10 నెలల్లో ఆ నిర్మాణాలు పూర్తవుతాయని ఆ సంస్థ ప్రతినిధులు చెప్పారు. వచ్చే ఏడాది కొత్తగా ఐదు నుంచి ఏడు స్టోర్లను ప్రారంభించాలని యోచిస్తున్నారు. మహారాష్ట్రలో 15 స్టోర్లు నిర్మించేందుకు రూ.900 కోట్లు పెట్టుబడిపెట్టినట్లు తెలిపింది.