Jagan: జగన్ పాదయాత్రకు ఏపీ పోలీసులు అనుమతి.. ఆనందంలో పార్టీ శ్రేణులు!

  • జగన్ పాదయాత్రకు తొలగిన అడ్డంకులు 
  • జగన్ పాదయాత్రకు ఏపీ పోలీసుల అనుమతి
  •  ఇకపై ఎవరు పాదయాత్ర చేయాలన్నా పోలీసుల అనుమతి తప్పని సరి

వైఎస్సార్సీపీ అధినేత జగన్ పాదయాత్రకు అడ్డంకులు తొలగిపోయాయి. జగన్ పాదయాత్రకు ఏపీ పోలీసులు అనుమతినిచ్చారు. దీనిపై డీజీపీ సాంబశివరావు మాట్లాడుతూ, ఎవరినీ ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం తమకు లేదని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే అనుమతి తప్పనిసరి అని తెలిపామని అన్నారు. వైఎస్సార్సీపీ నేతలు జగన్ పాదయాత్రకు దరఖాస్తు చేశారని ఆయన వెల్లడించారు.

పాదయాత్రలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇకపై ఎవరు పాదయాత్ర చేయాలనుకున్నా పోలీసుల అనుమతి తప్పని సరి అని ఆయన మరోసారి స్పష్టం చేశారు. పాదయాత్రకు అనుమతి కోరేవారు రూట్ మ్యాప్ ను అందజేయాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

Jagan
YSRCP
Andhra Pradesh
Police
ap police
  • Loading...

More Telugu News