nellore: నెల్లూరులో పోలీసుల ముందో సవాల్... సినిమా హాల్ లో వాష్ రూమ్ కు వెళ్లి తిరిగి రాని భార్య!

  • 31న నెల్లూరులోని ఎస్-2 థియేటర్ లో ఘటన 
  • బంధుమిత్రులను విచారించినా దొరకని ఆచూకీ
  •  పోలీసులను ఆశ్రయించిన భర్త

ఓ జంట సరదాగా కాసేపు గడుపుదామని సినిమాకు వెళితే, వాష్ రూముకు వెళ్లిన భార్య తిరిగి రాని ఘటన నెల్లూరులో కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, టీడీ గూడూరు మండలం వరిగొండ గ్రామంలో పోలంరెడ్డి అవినాష్ రెడ్డి, హరిత లక్ష్మి దంపతులు.

వీరు 31వ తేదీన నెల్లూరులోని ఎస్-2 థియేటర్ లో సినిమాకు వచ్చారు. సినిమా మధ్యలో హరిత వాష్ రూముకు వెళ్లి వస్తానని వెళ్లింది. ఆపై తిరిగి రాలేదు. ఆ చుట్టుపక్కలా గాలించి, బంధుమిత్రులను విచారించిన అవినాష్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామని, హరిత ఏమైందన్న విషయాన్ని కనుగొంటామని తెలిపారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News