drunk and drive: తాగి గుర్రాన్ని నడిపిన మహిళ... అరెస్టు చేసిన పోలీసులు!
- అమెరికాలోని ఫ్లోరిడాలో ఘటన
- రద్దీగా ఉండే రోడ్డు మీద గుర్రంతో బయల్దేరిన మహిళ
- డ్రైవ్ అండర్ ఇన్‌ఫ్లూయన్స్ చట్టం ప్రకారం నేరమంటున్న పోలీసులు
తాగి బండి నడిపితే పోలీసులు అరెస్టు చేస్తారేమోనని గుర్రం మీద బయల్దేరిందో మహిళ. అయినప్పటికీ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన 53 ఏళ్ల డోనా బర్న్ తాగి గుర్రం నడుపుతూ అరెస్టైంది. ఎలాంటి రక్షణ లేకుండా, అతిగా తాగి, గుర్రంతో సహా రద్దీగా ఉండే రోడ్డు మీదకి వచ్చిందనే నేరం కింద ఆమెను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఫ్లోరిడాలోని డ్రైవ్ అండర్ ఇన్‌ఫ్లూయన్స్ చట్టాల ప్రకారం బర్న్ చేసింది నేరం కింద పరిగణించి ఆమెను అరెస్టు చేసినట్లు వారు వివరించారు. బర్న్ నడిరోడ్డు మీద గుర్రంతో హల్‌చల్ చేస్తుండగా, ఆ దారిన పోతున్న ఓ ప్రయాణికుడు ఫోన్ చేయగా అక్కడికి వెళ్లినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆమె చేసిన పని వల్ల ఆమెకే కాకుండా గుర్రానికి, చుట్టుపక్కల వాళ్లకి కూడా ఇబ్బంది కలిగిందని షెరిఫ్ గ్రాడీ జెడ్ అన్నారు.