mahith narayan: బాగా గొడవ జరిగింది .. చక్రి ఇంట్లో నుంచి మేం వెళ్లిపోవాల్సి వచ్చింది : చక్రి సోదరుడు

  • చక్రికి మేం దూరమయ్యాం 
  • భార్యతో ఆయన ఉండాలనేదే అమ్మ ఆలోచన 
  • చక్రి చనిపోవడానికి ముందురోజు రాత్రి కలిశాను 
  • ఆయనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు

తాజాగా ఐ డ్రీమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహిత్ నారాయణ్ మాట్లాడుతూ, చక్రి మనోవేదనకు దారితీసిన పరిస్థితులను గురించి ప్రస్తావించారు. "చక్రి చనిపోవడానికి 21 రోజుల ముందు ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. ఆ ఇంట్లో ఉంటే తానైనా ఉండాలి .. లేదంటే మేమైనా ఉండాలి అంటూ చక్రి వైఫ్ గొడవ చేసింది" అని చెప్పారు.

"అలాంటి పరిస్థితుల్లో ఫ్యామిలీ కోసం వైఫ్ ను వదులుకోవడం కరెక్ట్ కాదన్నట్టుగా అమ్మ ఆలోచించడంతో మేమే బయటికి వెళ్లిపోయాం. ఆ సంఘటన జరిగిన 21 రోజుల తరువాత అన్నయ్య చనిపోయాడు. ఆ ముందు రోజు రాత్రి కూడా అన్నయ్యను కలిశాను. హెవీ వెయిట్ కారణంగా ఆయన అప్పుడప్పుడు శ్వాస తీసుకోవడానికి కాస్త ఇబ్బంది పడేవాడే తప్ప, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు" అంటూ ఆయన ఉద్వేగానికి లోనయ్యారు.    

  • Loading...

More Telugu News