ఫ్రాన్స్ లో దక్షిణాది 'క్వీన్' భామలు... బీచ్ లో సందడే సందడి!
- ఫ్రాన్స్ లో బిజీగా 'క్వీన్' చిత్ర యూనిట్
- నాలుగు భాషల్లో ఏకకాలంలో నిర్మితమవుతున్న 'క్వీన్'
- బాలీవుడ్ 'క్వీన్' రీమేక్ లో బిజీగా తమన్నా, కాజల్, మంజిమా
ఈ నేపథ్యంలో షూటింగ్ బాగా జరుగుతోందని చెబుతూ కాజల్ అగర్వాల్ ఫ్రెంచ్ రివీరా బీచ్ లో దిగిన ఫొటోను తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేయగా, తమన్నా విమానంలో మెహందీ పెట్టుకున్న ఫోటోను పోస్టు చేసింది. ఈ ఫోటోలు వారి అభిమానులను అలరిస్తున్నాయి.
తెలుగు 'క్వీన్' కు నీలకంఠ దర్శకత్వం వహిస్తుండగా, తమిళ, మలయాళ, కన్నడ 'క్వీన్' కు రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తెలుగులో 'క్వీన్' గా విడుదల కానుండగా, తమిళంలో 'పారిస్ పారిస్' గా విడుదల కానుంది. మలయాళంలో 'జామ్ జామ్', కన్నడలో 'బటర్ ఫ్లై' పేరుతో విడుదల కానుంది. ఈ నాలుగు చిత్రాలను ఏకకాలంలో చిత్రీకరించడం విశేషం.