bihar: ఆ ఫొటోలో అభ్యంతరం ఏముంది?...అది ఐపీఎల్ సందర్భంగా తీసినది కావచ్చు: తేజస్వి యాదవ్ వివరణ

  • తేజస్వీ యాదవ్ పాత ఫొటోను విడుదల చేసిన జేడీయూ
  • నితీష్ ప్రతిష్ఠ దెబ్బతినడంతోనే ఇలాంటి చర్యలు
  • అయినా ఆ ఫొటో నేను రాజకీయాల్లోకి రాకముందుది

జేడీయూ విడుదల చేసిన పాత ఫొటోపై బీహార్ మాజీ మంత్రి తేజస్వి యాదవ్ స్పందించారు. జేడీయూ పాలనలో అవినీతిని రూపుమాపి, పూర్తి స్థాయి మద్య నిషేధం అమలు చేస్తున్నామని ఓపక్క చెబుతుండగా... మరోపక్క అక్రమ మద్యం అమ్మకాల ఘటనలు వెలుగులోకి రావడంతో సీఎం నితీశ్‌ ప్రతిష్ఠ దెబ్బతింటోందని ఆయన అన్నారు. దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు తన పాత ఫొటోను తెరపైకి తెచ్చారని ఆరోపించారు.

ఆ ఫొటో తాను రాజకీయాల్లోకి రాకముందుదని తేజస్వి స్పష్టం చేశారు. ఐపీఎల్ టోర్నీ సందర్భంగా దానిని తీసి ఉండొచ్చని తేజస్వి యాదవ్ తెలిపారు. ఫొటోలో వున్న ఆమె ఎవరో తనకు తెలియదని, ఆమెతో తనకు పెద్దగా పరిచయం లేదని తేజస్వి యాదవ్ వివరణ ఇచ్చారు. అయినా ఆ ఫొటోలో అభ్యంతరమైనది ఏముందని ఆయన ప్రశ్నించారు. కాగా, జేడీయూ నేతలు విడుదల చేసిన ఆ ఫొటోలో తేజస్వియాదవ్ ఒక యువతితో ఉండగా, వెనుక బీరు సీసా ఉండడం విశేషం.

bihar
nitish kumar
tejaswi yadav
jdu
rjd
  • Loading...

More Telugu News