trinamool congress: బీజేపీలో చేరిన తృణ‌మూల్ కాంగ్రెస్ మాజీ నాయ‌కుడు ముకుల్ రాయ్‌

  • మీడియా స‌మావేశం ఏర్పాటు చేసిన బీజేపీ
  • ముకుల్ చేరిన‌ట్లు వెల్ల‌డించిన కేంద్ర‌మంత్రి
  • మోదీ ప్ర‌భుత్వంతో ప‌నిచేయ‌డానికి ఆత్రుత‌గా ఉంద‌న్న ముకుల్‌

అంద‌రూ అనుకున్నట్లుగానే తృణ‌మూల్ కాంగ్రెస్ మాజీ నాయ‌కుడు ముకుల్ రాయ్, భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరిపోయారు. ఈ సంద‌ర్భంగా బీజేపీ వ‌ర్గం మీడియా స‌మావేశం ఏర్పాటు చేసింది. ఈ స‌మావేశంలో కేంద్ర మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ పాల్గొన్నారు. 'ఇవాళ ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుడు ముకుల్ రాయ్ బీజేపీలో చేరారు' అని ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ ప్రకటించారు.

 అనంతరం ముకుల్ రాయ్ మాట్లాడుతూ... 'బీజేపీలో చేరాను. అందుకు చాలా గ‌ర్వంగా ఉంది. ప్ర‌ధాని నరేంద్ర‌మోదీ ప్ర‌భుత్వంతో క‌లిసి ప‌నిచేయ‌డానికి ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నాను' అన్నారు. సెప్టెంబ‌ర్ 25న పార్టీని వ‌దిలిపెట్టి, అక్టోబ‌ర్ 11న రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి ముకుల్ రాయ్ రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే.

trinamool congress
west bengal
bjp
mukul roy
ravi shankar prasad
  • Loading...

More Telugu News