charan: భారీ రేటుకు 'రంగస్థలం' శాటిలైట్ హక్కులు .. పవన్ తరువాత ప్లేస్ లో చరణ్!

  • షూటింగ్ దశలో 'రంగస్థలం 1985'
  • శాటిలైట్ రైట్స్ కోసం నెలకొన్న పోటీ 
  • 18 కోట్లకు 'రంగస్థలం' శాటిలైట్ హక్కులు
  • 21 కోట్లకు 'అజ్ఞాతవాసి' శాటిలైట్ హక్కులు

చరణ్ .. సుకుమార్ కాంబినేషన్లో 'రంగస్థలం 1985' సినిమా తెరకెక్కుతోంది. సమంతా కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. అందువలన శాటిలైట్ రైట్స్ కి గట్టి పోటీ ఏర్పడిందట.

 ప్రముఖ టీవీ ఛానల్ వారు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను సొంతం చేసుకున్నారని సమాచారం. ఇందుకుగాను వాళ్లు 18 కోట్లు చెల్లించారని అంటున్నారు. నాన్ 'బాహుబలి' చిత్రాల కేటగిరిలో చూస్తే శాటిలైట్ హక్కుల ద్వారా భారీ రేటును రాబట్టిన తొలి సినిమాగా 'అజ్ఞాతవాసి' వుంది. ఈ సినిమా శాటిలైట్ హక్కులు 21 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇప్పుడు 'రంగస్థలం' సినిమా శాటిలైట్ హక్కుల పరంగా 18 కోట్లు రాబట్టడంతో, పవన్ తరువాత స్థానంలో చరణ్ నిలిచినట్టైంది. 

  • Loading...

More Telugu News