china rajappa: 'నాకు సీఎం కుర్చీ కావాల్సిందే' అనేది వదిలేస్తే బాగుండేది: జగన్‌పై చినరాజప్ప విమర్శలు
- జగన్ తీరు బాగోలేదు
- అసెంబ్లీని బహిష్కరించడం ఏంటీ?
- సమస్యలు చెప్పి, వాటిని పరిష్కరించేలా చేయాలి
అసెంబ్లీని బహిష్కరించనున్నట్లు ప్రకటించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీరు బాగోలేదని ఏపీ హోం శాఖ మంత్రి చినరాజప్ప అన్నారు. ఈ రోజు తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... అసెంబ్లీకి హాజరై, ప్రజా సమస్యలను వివరించి, వాటిని పరిష్కరించే దిశగా కృషి చేయాల్సిన జగన్ ఇటువంటి తీరును ప్రదర్శించడమేంటని ప్రశ్నించారు.
జగన్ తనకు సీఎం కుర్చీ కావాలంటూ వాదించే తీరు వదిలేసి ప్రజా సమస్యల గురించి తెలుసుకుని, వివరిస్తే బాగుండేదని అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం తన వంతుగా ఏం చేయాలన్న ఆలోచన జగన్ ఎందుకు చేయరని ప్రశ్నించారు. అసెంబ్లీని బహిష్కరిస్తానని చెప్పడం మంచిదికాదని అన్నారు.