prakash raj: ఇది హిందూ ఉగ్రవాదం కాక‌పోతే మ‌రేంటీ?: సినీన‌టుడు ప్ర‌కాశ్ రాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

  • నిన్న‌ సినీన‌టుడు కమల హాస‌న్ అనుచిత వ్యాఖ్య‌లు
  • క‌మ‌ల్‌కి మ‌ద్ద‌తు తెలుపుతూ ప్ర‌కాశ్ రాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
  • నైతికత పేరుతో దేశంలోని ప్రేమ జంట‌లపై దాడులు చేయడం ఉగ్ర‌వాదం కాదా?
  • గోర‌క్ష‌కుల పేరుతో చ‌ట్టాన్ని త‌మ చేతుల్లోకి తీసుకోవ‌డం టెర్ర‌రిజం కాదా?

మ‌న‌ దేశంలో హిందూ ఉగ్రవాదం పెరిగిపోయిందని సినీన‌టుడు కమల హాస‌న్ అనుచిత వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఈ ఉగ్రవాదాన్ని అడ్డుకోవడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని వ్యాఖ్యానించారు. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై బీజేపీ నేత‌ల‌తో పాటు హిందువులు మండిప‌డుతోంటే సినీ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ మాత్రం స‌మ‌ర్థించాడు. అంతేగాక 'ఇది హిందూ ఉగ్ర‌వాదం కాక మరేమిటీ?' అంటూ ప‌లు వ్యాఖ్య‌లు చేశాడు.

మతం, సంప్ర‌దాయం పేర్ల‌తో ప్ర‌జ‌ల్లో భ‌యాన్ని పుట్టించ‌డం ఉగ్ర‌వాదం కాక మ‌రేంట‌ని ప్ర‌కాశ్ రాజ్ అన్నాడు. 'నాకు తెలియ‌క అడుగుతున్నాను, స‌మాధానం చెప్పండి' అంటూ ప‌లు ప్ర‌శ్న‌లు సంధించాడు. నైతికత పేరుతో దేశంలోని ప్రేమ జంట‌లపై దాడులు చేయడం ఉగ్ర‌వాదం కాదా? అని ప్ర‌శ్నించాడు. గోర‌క్షుల పేరుతో దాడుల‌కు పాల్ప‌డుతూ చ‌ట్టాన్ని త‌మ చేతుల్లోకి తీసుకోవ‌డం టెర్ర‌రిజం కాదా?' అని అడిగారు.

  • Loading...

More Telugu News