north korea: ఉత్తర కొరియా భూభాగంపై బాంబులను జారవిడిచిన అమెరికా, దక్షిణ కొరియా

  • బీ-1బీ బాంబులను జారవిడిచిన యూఎస్
  • కొరియా భూభాగంపై మాక్ డ్రిల్
  • మండిపడ్డ ఉత్తర కొరియా

తమపై అమెరికా, దక్షిణ కొరియాలు కయ్యానికి కాలు దువ్వుతున్నాయని ఉత్తర కొరియా మండిపడింది. నిన్న నిర్వహించిన మాక్ డ్రిల్ సందర్భంగా అమెరికా తమ భూభాగంలోని కొన్ని ప్రదేశాల్లో బీ-1బీ బాంబులను జారవిడిచిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. గువాంలోని అండర్సన్ ఎయిర్ బేస్ నుంచి వచ్చిన అమెరికా, దక్షిణ కొరియా యుద్ధ విమానాలు తమపై మాక్ డ్రిల్ నిర్వహించాయని... తద్వారా తమకు హెచ్చరికలు పంపాలని చూశాయని మండిపడింది.

ఈ మేరకు స్థానిక మీడియా కేసీఎన్ఏ ఈరోజు కథనాలను ప్రసారం చేసింది. అయితే యుద్ధం కోసం తమ బలగాలను మోహరించినట్టు కానీ, యుద్ధ విమానాలతో దాడులకు సిద్ధమైనట్టు కానీ అమెరికా, దక్షిణ కొరియాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదని తెలిపింది. 

north korea
south korea
america
us mock drill
  • Loading...

More Telugu News