akkineni nagarjuna: అప్పుడూ ఇలాగే షాక్ అయ్యారు.. లెట్స్ రాక్ రామూ!: నాగార్జున

  • వర్మతో శివ చేస్తున్నానగానే ఎంతో మంది షాక్ అయ్యారు
  • అప్పుడు అందరి అంచనాలు తప్పయ్యాయి
  • ఇప్పుడు కూడా చాలా మంది షాక్ అవుతున్నారు

అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో సినిమా రాబోతోందనే వార్త వెలువడగానే టాలీవుడ్ ఆడియెన్స్ అంతా దీనిపై దృష్టి సారించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి నాగార్జున ట్విట్టర్ ద్వారా స్పందించాడు. "1988లో రామ్ గోపాల్ వర్మతో శివ సినిమాను చేయడానికి నేను అంగీకరించినప్పుడు... ఎంతో మంది షాక్ అయ్యారు. అయితే అందరి అంచనాలు తప్పని రామ్ ప్రూవ్ చేశాడు. ఇప్పుడు 2017లో కూడా చాలా మంది షాక్ అవుతున్నారు. చాలా మంది ఆనందంగా కూడా ఉన్నారు. లెట్స్ రాక్ రామూ" అంటూ ట్వీట్ చేశాడు.

akkineni nagarjuna
ram gopal varma
shiva movie
tollywood
  • Loading...

More Telugu News