team india: కోహ్లీని పాంటింగ్ తో పోల్చవద్దు... సౌతాఫ్రికా పర్యటనతో తేలిపోతుంది: గిల్ క్రిస్ట్

  • మాజీలతో ప్రస్తుత ఆటగాళ్లను పోల్చడం తప్పు
  • కోహ్లీ దూకుడుగా ఆడుతూ ఆకట్టుకుంటున్నాడు
  • స్వదేశంలో అద్భుతంగా ఆడుతున్నారు...విదేశాల్లో చూడాలి

టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీని ఆసీస్‌ మాజీ సారథి రికీ పాంటింగ్‌ తో పోల్చలేమని ఆస్ట్రేలియా క్రికెట్‌ దిగ్గజం ఆడమ్ గిల్‌ క్రిస్ట్‌ స్పష్టం చేశాడు. సాధారణంగా ప్రతి విభాగంలోనూ ఎవరో ఒకరిని మాజీలతో పోలుస్తాం... కానీ ఆ పధ్ధతి తప్పని హితవు పలికాడు.

కోహ్లీ దూకుడుగా ఆడుతూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడని, అతనిని చూసి టీమిండియా స్పూర్తి పొందుతోందని, దీంతో జట్టు విజయాలు సాధిస్తోందని గిల్లీ అభిప్రాయపడ్డాడు. కఠిన సవాళ్లు ఎదురైనప్పుడు కూడా కోహ్లీ జట్టును సమర్ధవంతంగా నడిపిస్తున్నాడని అన్నాడు. కోహ్లీ జట్టును నడిపించే తీరు తనను బాగా ఆకట్టుకుంటోందని గిల్లీ చెప్పాడు.

ఇక టీమిండియా ప్రస్తుతం చాలా బలంగా ఉందని అన్నాడు. నాణ్యమైన పేస్, స్పిన్ బౌలింగ్ తో జట్టు ఆకట్టుకుంటోందని చెప్పాడు. ప్రధానంగా టీమిండియా స్వదేశంలోని అన్ని సిరీస్ లలో విజయాలతో ఆకట్టుకుంటోందన్న గిల్లీ, విదేశాల్లో ఎలా ఆడుతుందో చూడాలని అన్నాడు. త్వరలోనే టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది కనుక అక్కడ ఏంజరుగుతుందో చూద్దామని ఆసక్తి వ్యక్తం చేశాడు. 

  • Loading...

More Telugu News