nehra: నెహ్రాకు మనసును హత్తుకునే మెసేజ్ పంపిన పాక్ బౌలర్ షోయబ్ అఖ్తర్!

  • ఇంటర్నేషనల్ క్రికెట్ కు నెహ్రా వీడ్కోలు
  • ట్విట్టర్ ఖాతాలో మెసేజ్ పెట్టిన అఖ్తర్
  • నీతిమంతమైన ఫాస్ట్ బౌలరని కితాబు

రెండు రోజుల నాడు ఇంటర్నేషనల్ క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించిన బౌలర్ ఆశిష్ నెహ్రాకు వీడ్కోలు పలుకుతూ పాకిస్థాన్ ఆటగాడు, ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ పెట్టిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. 38 ఏళ్ల వయసున్న నెహ్రా, సొంత మైదానమైన న్యూఢిల్లీ ఫిరోజ్ షా కోట్లాలో న్యూజిల్యాండ్ తో టీ-20ని ఆడి, తన 18 ఏళ్ల క్రికెట్ కెరీర్ కు ముగింపు పలికిన సంగతి తెలిసిందే.

నెహ్రా రిటైర్ మెంట్ పై అఖ్తర్ స్పందిస్తూ, తనతో పాటు ఆడిన నీతిమంతమైన ఫాస్ట్ బౌలర్లలో నెహ్రా ఒకడని కొనియాడాడు. ఆయనతో కలసి ఆడటం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని, నెహ్రా స్వతహాగా ఓ మంచి వ్యక్తని అన్నాడు. తదుపరి నెహ్రా తన జీవితాన్ని ఆనందంగా గడపాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. తన కెరీర్ లో పలుమార్లు ఎత్తు పల్లాలను ఎదుర్కొన్న నెహ్రా, ఫిట్ నెస్ నిరూపించుకుని తిరిగి మెయిన్ టీమ్ లో స్థానం పొందిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

nehra
kohli
delhi
cricket
new zeland
akhtar
  • Loading...

More Telugu News