ram gopal varma: ఈ ఒక్క పని చేస్తే నా ప్రతీకారం పూర్తవుతుంది: రామ్ గోపాల్ వర్మ

  • నేను ఎందుకూ పనికిరానని అమ్మ భావించేది
  • నాగ్ సినిమాకు ఆమెతో క్లాప్ కొట్టిస్తా
  • ఫేస్ బుక్ లో వర్మ కామెంట్

ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫేస్ బుక్ ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తల్లి తనను చాలా తక్కువగా అంచనా వేశారని... తాను ఎందుకూ పనికిరానని భావించేవారని చెప్పారు. అందుకే నాగార్జునతో తీయబోతున్న కొత్త సినిమాకు ఆమె చేత క్లాప్ కొట్టిస్తానని... దీంతో, తన తల్లిపై తన ప్రతీకారం పూర్తవుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా అమ్మతో కలసి దిగిన ఫొటోను అప్ లోడ్ చేశారు.
ఈ నెల 20వ తేదీన నాగ్ తో కొత్త సినిమాను ప్రారంభిస్తున్నట్టు సోషల్ మీడియా ద్వారా వర్మ తెలిపారు. అయితే ఈ సినిమా 'శివ'కు సీక్వెల్ గా ఉంటుందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఖండించిన నాగార్జున... ఈ ప్రచారం అసత్యమని చెప్పారు. ఆ సినిమాకు, ఈ సినిమాకు ఎలాంటి పోలిక ఉండదని తెలిపారు. 

ram gopal varma
shiva movie
varma revenge on his mother
tollywood
nagarjuna
amala
  • Loading...

More Telugu News