kamal r khan: ఇక నాకు ఆత్మహత్యే శరణ్యం...అందుకు ట్విట్టరే దే బాధ్యత: కేఆర్కే సంచలన ప్రకటన
- కేఆర్కే ఖాతాను సస్పెండ్ చేసిన ట్విట్టర్
- 15 రోజుల్లోగా తిరిగి పునరుద్ధరించండి
- లేకుంటే ఆత్మహత్య చేసుకుంటా
- బెదిరించిన కమాల్ రషీద్ ఖాన్
సినీ విశ్లేషకుడు, తనదైన శైలిలో రివ్యూలు, చిత్ర విశేషాలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో పంచుకునే కమాల్ రషీద్ ఖాన్ అలియాస్ కేఆర్కే, తనకిక ఆత్మహత్యే శరణ్యమని సంచలన ప్రకటన చేశాడు. ఈ మేరకు మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన, "ట్విట్టర్ ఇండియా ప్రధాన ఉద్యోగులైన మహిమా కౌల్, విరల్ జాని, తరంజిత్ సిగ్తోలను నేను ఒకటే కోరుకుంటున్నాను. 15 రోజుల్లోగా నా ట్విట్టర్ ఖాతాను పునరుద్దరించండి. మీరు నా ఖాతాను సర్పెండ్ చేశారు. నా దగ్గర డబ్బు తీసుకుని నన్ను మోసం చేశారు. వెంటనే నా ఖాతాను తిరిగి పునరుద్ధరించకుంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను. నా చావుకు కారణం మాత్రం మీరే" అంటూ వ్యాఖ్యానించాడు.
కాగా, అక్టోబర్ 18న కేఆర్కే ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అమీర్ ఖాన్ తాజా చిత్రం 'సీక్రెట్ సూపర్ స్టార్' క్లయిమాక్స్ ను గురించి ముందే ఆయన వెల్లడించగా, అమీర్ అభిమానుల ఫిర్యాదుతో ట్విట్టర్ ఆయన ఖాతాను సస్పెండ్ చేసింది.