ram gopal varma: మా నాన్నపై ప్రతీకారం తీర్చుకున్నా: రామ్ గోపాల్ వర్మ!

  • నేను డైరెక్టర్ అవుతానని నాన్న ఊహించలేదు
  • నా తొలి సినిమా తొలి క్లాప్ నాన్నతోనే కొట్టించా
  • నాగార్జున, అమలపై తొలి క్లాప్

ప్రతి రోజు ఏదో ఒక వివాదంతో కూడిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈసారి ఆయన తన తండ్రి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సినీ దర్శకుడిని అవుతాననే విషయాన్ని తన తండ్రి ఎన్నడూ నమ్మలేదని వర్మ చెప్పాడు.

అయితే, తన తొలి సినిమా అయిన 'శివ'కు తొలి క్లాప్ ను తన తండ్రితోనే కొట్టించానని... ఆ విధంగా ఆయనపై ప్రతీకారం తీర్చుకున్నానని ఫేస్ బుక్ ద్వారా వెల్లడించాడు. 1989 ఫిబ్రవరి 16వ తేదీన ముహూర్తపు క్లాప్ ను నాగార్జున, అమలపై కొట్టారు.
.

ram gopal varma
shiva movie
varma revenge on his father
tollywood
nagarjuna
amala
  • Loading...

More Telugu News