upendra: రియల్ స్టార్ ఉపేంద్రపై పోలీసు కేసు!

  • కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీని ప్రారంభించిన ఉపేంద్ర
  • 'ఎన్నికల ప్రచారంలో నోట్లు పంచితే తీసుకోండి...వారికి ఓటు వేయకండి' అన్న ఉపేంద్ర
  • ఉపేంద్ర వ్యాఖ్యలు అవినీతిని పెంచేలా ఉన్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన జేడీయూ ప్రధాన కార్యదర్శి  

శాండల్ వుడ్ రియల్‌ స్టార్‌ ఉపేంద్రపై కర్ణాటకలోని బనశంకరి శేషాద్రిపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దాని వివరాల్లోకి వెళ్తే.. ఉపేంద్ర తాజాగా కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో రాజకీయ నేతలు డబ్బులిస్తే తీసుకోండి, కానీ ఓటుమాత్రం వారికి వేయవద్దు అన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన జేడీయూ ప్రధాన కార్యదర్శి ఎన్‌.నాగేశ్‌... అవినీతిని ప్రోత్సహించే విధంగా ఉపేంద్ర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదైంది. 

upendra
karnataka
comments
  • Loading...

More Telugu News