nirbhaya brother: రాహుల్ గాంధీ ఆదుకున్నాడంటున్న 'నిర్భయ' తల్లి!

  • నిర్భయ కుటుంబాన్ని ఆదుకున్న రాహుల్ గాంధీ
  • నిర్భయ సోదరుడ్ని పైలట్ చేసిన వైనం 
  • ప్రియాంకా గాంధీ కూడా తమ కుటుంబ క్షేమ సమాచారం కనుక్కునేవారంటున్న నిర్భయ తల్లి

దేశరాజధాని ఢిల్లీలో 'నిర్భయ' ఘటన చోటుచేసుకుని ఐదేళ్లు పూర్తి కావస్తోంది. నాటి ఆ ఘటన యావద్భారతదేశాన్ని పట్టికుదిపేసింది. సరికొత్త ఉద్యమానికి కారణమైంది. సరికొత్త చట్టాన్ని రూపొందించేలా చేసింది. దానిపై నిర్భయ కుటుంబం సుదీర్ఘ పోరాటం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ కుటుంబాన్ని ఏఐసీసీ డిప్యూటీ చీఫ్ రాహుల్ గాంధీ ఆదుకున్నారని నిర్భయ (జ్యోతి సింగ్) తల్లి తెలిపారు. అక్క మరణంతో తీవ్రమైన బాధతో ఒత్తిడిలోకి వెళ్లిపోయిన తన కుమారుడికి రాహుల్ గాంధీ కౌన్సిలింగ్ ఇప్పించారని ఆమె తెలిపారు.

ఎప్పటికప్పుడు ఫోన్ లో మాట్లాడుతూ, జీవితంలో ఏదో ఒకటి సాధించాలని స్పూర్తి నింపేవారని ఆమె తెలిపారు. రక్షణ రంగంలో రాణించాలని ఉందని కోరిక వెలిబుచ్చడంతో రాయ్ బరేలీలో పైలట్ శిక్షణ ఇప్పించారని, ఇప్పుడు తన కుమారుడు పైలట్ అయ్యాడని చెబుతూ, రాహుల్ గాంధీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. రాహుల్ గాంధీ మాత్రమే కాకుండా ప్రియాంకా గాంధీ కూడా ఫోన్ చేసి, తమ కుటుంబ క్షేమ సమాచారం తెలుసుకునేవారని ఆమె పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News