lalu prasad yadav: ఇలాంటివారిపై జీవితకాల నిషేధం విధించండి: లాలూ సంచలన వ్యాఖ్యలు

  • దోషులైన నేతలపై జీవితకాల నిషేధం విధించాలన్న ఈసీ
  • ఈసీ నిర్ణయంపై లాలూ హర్షం
  • రాజకీయ వ్యవస్థ మెరుగు పడుతుందంటూ వ్యాఖ్య

కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాలం నిషేధం విధించాలంటూ సుప్రీంకోర్టుకు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసీ నిర్ణయంపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ ఆహ్వానిస్తారని... దీనివల్ల రాజకీయ వ్యవస్థ అత్యున్నతంగా ఉంటుందని చెప్పారు.

మచ్చపడ్డ నేతలపై జీవితకాల నిషేధం విధించాలంటూ సుప్రీంను ఈసీ కోరిన గంటల వ్యవధిలోనే లాలూ ఈ విధంగా స్పందించడం చర్చనీయాంశం అయింది. ఇప్పటికే ఆయన పలు కేసుల్లో ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆరేళ్ల నిషేధాన్ని కూడా ఎదుర్కొంటున్నారు. 

lalu prasad yadav
election commission
rjd
  • Loading...

More Telugu News