SCR: మారిన రైళ్ల రాకపోకల వేళలతో ద.మ.రై నూతన టైం టేబుల్ విడుదల

  • ఇటీవల మారిన రైళ్ల సమయాలు
  • దక్షిణ మధ్య రైల్వే సమగ్ర సమాచారం అరచేతిలో 
  • దక్షిణ, దక్షిణ పశ్చిమ, కొంకణ్ రైల్వేల వివరాలు కూడా
  • దూ. 35 మాత్రమే: జీఎం వినోద్ కుమార్

ఇటీవలి కాలంలో మారిన రైళ్ల రాకపోకల వివరాలు, కొత్త రైళ్లు, ఇతర సమగ్ర సమాచారంతో కూడిన నూతన టైం టేబుల్ బుక్ ను దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసింది. సికింద్రాబాద్ లోని రైల్ నిలయంలో జీఎం వినోద్ కుమార్ యాదవ్ ఈ పుస్తకాన్ని విడుదల చేశారు.

దీనిలో దక్షిణ మధ్య రైల్వేతో పాటు దక్షిణ, దక్షిణ పశ్చిమ, కొంకణ్ రైల్వేల వివరాలు ఉన్నాయని ఆయన అన్నారు. రైల్వేల మ్యాప్, రైళ్ల నంబర్లు, సమయాలు, టికెట్ ధరలు, దురదృష్టవశాత్తూ ప్రమాదం జరిగితే నష్ట పరిహారం వివరాలు తదితరాలు ఇందులో ఉంటాయని ఆయన అన్నారు. అన్ని రైల్వే స్టేషన్లలో అమ్మకానికి సిద్ధమైన ఈ బుక్ ఖరీదు రూ. 35 అని వెల్లడించారు.

SCR
pocket book
train time table
  • Loading...

More Telugu News