somireddy chandramohan reddy: మంత్రి సోమిరెడ్డికి చేదు అనుభవం

  • గుంటూరు ప్రత్తిపాడు మండలంలో సోమిరెడ్డి పర్యటన
  • పత్తి పంటను పరిశీలించిన మంత్రి
  • నాసిరకం పురుగు మందులు వస్తున్నాయంటూ రైతుల ఆవేదన

ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళ్తే, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెం, కోయవారిపాలెం గ్రామాల్లో ఆయన పర్యటించారు. గులాబీ బారిన పడి నాశనం అవుతున్న పత్తి పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వెంట స్థానిక ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు, వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు.

ఈ సందర్భంగా మంత్రిని స్థానిక రైతులు నిలదీశారు. పురుగు మందుల కంపెనీలపై అధికారులకు ఏ మాత్రం నిఘా లేదని... ప్రభుత్వం పట్టించుకోవాలంటూ సోమిరెడ్డితో వాదనకు దిగారు. ఈ నేపథ్యంలో రైతులను శాంతింపజేసేందుకు సోమిరెడ్డి ప్రయత్నించారు. ఆయన మాట్లాడుతూ, నకిలీ పురుగు మందులు అమ్ముతున్న కంపెనీలపై చర్యలు తీసుకుంటామంటూ రైతులకు హామీ ఇచ్చి, అక్కడ నుంచి వచ్చేశారు. 

somireddy chandramohan reddy
ap minister
  • Loading...

More Telugu News