nehra: 'అద్భుతహ..' అన్నట్టు అభినందిస్తున్న విరాట్ కోహ్లీ వీడియో చూడండి!

• నిన్న ఢిల్లీలో నెహ్రాకు చివరి మ్యాచ్
• ఫీల్డింగ్ చేస్తూ తనలోని నైపుణ్యాన్ని చూపిన నెహ్రా
• సహచరుల నుంచి అభినందనలు
• వీడియో విడుదల చేసిన బీసీసీఐ

నిన్న దేశ రాజధాని ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో సీనియర్ ఆటగాడు ఆశిష్ నెహ్రా తన చిట్టచివరి అధికారిక క్రికెట్ మ్యాచ్ ని ఆడిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ తో జరిగిన టీ-20లో నెహ్రాకు అవకాశం ఇచ్చి అతనికి ఘనమైన వీడ్కోలు పలకాలని బీసీసీఐ భావించి, నెహ్రాను ఆడించిన సంగతి తెలిసిందే.

ఇక ఈ మ్యాచ్ అనంతరం ఢిల్లీ ఆటగాళ్లైన కోహ్లీ, శిఖర్ లు నెహ్రాను తమ భుజాలపై ఎక్కించుకుని మరీ ఊరేగిస్తూ, సీనియర్ కు వీడ్కోలు పలికారు. ఈ మ్యాచ్ లో నెహ్రాకు ఒక్క వికెట్ కూడా దక్కకపోయినా, తన ఫీల్డింగ్స్ స్కిల్స్ తో 'ఔరా'  అనిపించాడు. ఆట జరుగుతున్న వేళ, న్యూజిలాండ్ ఆటగాడు మిడాన్ మీదుగా బాల్ ను పంపితే, ఫీల్డింగ్ చేస్తున్న నెహ్రా, తన కాలితో దాన్ని అడ్డుకుని గాల్లోకి లేపి, పరుగుతీస్తూ చేత్తో అందుకుని కీపర్ వైపు విసిరాడు.

ఇక నెహ్రా ఫీల్డింగ్ స్కిల్ కు ఫిదా అయిపోయిన ప్రతి ఒక్కరూ దగ్గరికి వచ్చి మరీ అభినందించారు. ఆ సమయంలో కోహ్లీ హావభావాలను బీసీసీఐ ఓ వీడియో రూపంలో విడుదల చేసింది. నెహ్రా నైపుణ్యం అద్భుతహ... అన్నట్టు చూస్తున్న కోహ్లీని మీరూ చూడవచ్చు.

How's that for footy skills from our very own Nehraji? What do you make of that @YUVSTRONG12 ;) #INDvNZ pic.twitter.com/YaTeJk5d0t
— BCCI (@BCCI) November 1, 2017

nehra
kohli
delhi
cricket
new zeland
• Loading...

More Telugu News