narayana college: నారాయణ కాలేజీకి భారీ జరిమానా విధించిన అధికారులు!

  • రూ. 10 లక్షల జరిమానా
  • విద్యార్థి ఆత్మహత్యపై అధికారుల విచారణ
  • యాజమాన్యం, సిబ్బంది తప్పుందన్న అధికారులు

నారాయణ కాలేజీ యాజమాన్యానికి అధికారులు భారీ షాక్ ఇచ్చారు. కడప జిల్లాలోని నారాయణ కాలేజీకి రూ. 10 లక్షల జరిమానా విధించారు. ఈ విషయాన్ని ఆర్ఐఓ రవి తెలిపారు. వివరాల్లోకి వెళ్తే, కడప జిల్లా రాయచోటిలో ఉన్న కళాశాలలో అధికారులు నిన్న ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ, కాలేజీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై సమగ్ర విచారణ జరిపామన్నారు. విద్యార్థి ఆత్మహత్య విషయంలో కాలేజీ యాజమాన్యం, సిబ్బంది తప్పు ఉన్నందున, జరిమానా విధించామని చెప్పారు. విద్యార్థులపై ప్రభుత్వ కాలేజీలు కానీ, ప్రైవేట్ కాలేజీలు కానీ ఒత్తిడి పెంచితే చర్యలు తప్పవని హెచ్చరించారు. 

narayana college
fine to narayana college
  • Loading...

More Telugu News