cricket: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
- ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో తొటి టీ20
- వన్డే సిరీస్‌లో కివీస్‌పై గెలిచిన టీమిండియా
- టీ20ల్లో గెలిస్తే రెండో స్థానానికి ఎగబాకే అవకాశం
ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో మరికాసేపట్లో భారత్, న్యూజిలాండ్ క్రికెట్ జట్ల మధ్య మొదటి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. వన్డే సిరీస్‌లో కివీస్‌పై గెలిచిన టీమిండియా అదే ఉత్సాహాన్ని టీ20ల్లోనూ కొనసాగించాలని చూస్తోంది. అయితే, టీ20ల్లో 125 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్‌ను ఓడించాలంటే టీమిండియా కష్టపడాల్సిందే. టీ20 ఫార్మాట్‌లో భారత్ (116) ఐదో స్థానంలో ఉంది. న్యూజిలాండ్‌తో టీ20ల్లో భారత్ గెలిస్తే భారత్ రెండో స్థానానికి చేరుకుంటుంది.
భారత జట్టు: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, ధోని, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ఆశిష్ నెహ్రా, చాహల్, బుమ్రా.
న్యూజిలాండ్ జట్టు: గప్తిల్, మున్రో, కానె విలియమ్సన్ (కెప్టెన్), బ్రూసీ, లాథమ్, నికోలస్, గ్రాండ్‌హోమ్, శాంట్నర్, సౌథీ, బౌల్ట్, సౌథీ.