seethakka: ఎర్రబెల్లిపై విరుచుకుపడ్డ సీతక్క!

  • పదవుల కోసమే అయితే టీఆర్ఎస్ లోనే చేరేదాన్ని
  • రేవంత్ తో కలసి ప్రజాపోరాటం చేశా
  • కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా రాజకీయ ఏకీకరణ జరగాలి

టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావుపై కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సీతక్క నిప్పులు చెరిగారు. ఆయనలా తాను పదవుల కోసమో, డబ్బు కోసమో పార్టీ మారలేదని మండిపడ్డారు. పదవుల కోసమే అయితే టీఆర్ఎస్ లోనే చేరేదాన్నని చెప్పారు. ఎర్రబెల్లి వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.  గత మూడేళ్లుగా రేవంత్ తో కలసి తాను ప్రజాపోరాటం చేశానని, రేవంత్ కుటుంబం తనను ఇంటి ఆడబిడ్డలా చూసుకుంటుందని తెలిపారు. రాష్ట్రంలో కొనసాగుతున్న కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడేందుకే రేవంత్ తో కలసి కాంగ్రెస్ లో చేరానని చెప్పారు. ప్రజావ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా రాజకీయ ఏకీకరణ జరగాలని అన్నారు.

seethakka
revanth reddy
congress
errabelli dayakar rao
TRS
  • Loading...

More Telugu News