taskin ahmed: ప్రేమ వివాహం చేసుకున్న బంగ్లాదేశ్ క్రికెటర్

  • ఓ ఇంటివాడైన తస్కిన్
  • స్నేహితురాలితో పెళ్లి
  • హాజరైన మోర్తజా, తమీమ్ ఇక్బాల్

బంగ్లాదేశ్ క్రికెటర్ తస్కిన్ అహ్మద్ వివాహ బంధంతో ఓ ఇంటివాడయ్యాడు. తన స్నేహితురాలు సయీదా రబియాను తస్కిన్ పెళ్లాడాడు. ఢాకాలోని షయైమోలి కన్వెన్షన్ సెంటర్ లో నిన్న రాత్రి వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి బంగ్లా క్రికెటర్లు మోర్తజా, తమీమ్ ఇక్బాల్ లు హాజరయ్యారు. తస్కిన్, రబియాలకు ఏడాది క్రితమే నిశ్చితార్థం జరిగింది. బంగ్లాదేశ్ లోని అమెరికా అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో వీరిద్దరూ కలసి చదువుకున్నారు. అప్పుడే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.

త్వరలో ప్రారంభం కానున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో చిట్టగాంగ్ వైకింగ్స్ జట్టు తరపున తస్కిన్ ఆడనున్నాడు. 

taskin ahmed
taskin ahmed marriage
bangladesh cricketer
  • Loading...

More Telugu News