trump: ఈ నెలలో 12 దేశాల్లో అమెరికా అధ్యక్షుడి ప‌ర్య‌ట‌న‌.. భవిష్యత్తులో భార‌త్‌లో ప్రత్యేక పర్యటన!

  • డొనాల్డ్‌ ట్రంప్ ఈ నెల చివ‌ర్లో ఆసియా పర్యటన
  • ఇండో పసిఫిక్‌ పాంతంలో భారత్‌ కీలక పాత్ర పోషిస్తుంది
  • జపాన్‌, దక్షిణకొరియా, చైనాతో పాటు 12 దేశాల్లో అమెరికా అధ్యక్షుడి ప‌ర్య‌ట‌న‌
  • భ‌విష్య‌త్తులో భారత్‌లో ప్రత్యేకంగా పర్యటన‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఈ నెల చివ‌ర్లో ఆసియా పర్యటనకు బయ‌లుదేర‌నున్న నేపథ్యంలో భారత్‌పై వైట్‌హౌస్ కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. భార‌త్‌తో త‌మ దేశానికి బలమైన సత్సంబంధాలున్నాయని శ్వేతసౌధం ప్రెస్‌ సెక్రటరీ సారా శాండర్స్‌ అన్నారు. ఇండో పసిఫిక్‌ పాంతంలో భారత్‌ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. భారత్‌ కచ్చితంగా పెద్ద పాత్ర పోషిస్తుందని వ్యాఖ్యానించారు. భార‌త్‌, అమెరికా రెండూ ప్రజాస్వామ్య దేశాలేన‌ని, పెద్ద దేశాలేన‌ని పేర్కొన్నారు. కాగా, డొనాల్డ్ ట్రంప్.. జపాన్‌, దక్షిణకొరియా, చైనాతో పాటు 12 దేశాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. ట్రంప్ ప‌ర్య‌టించే దేశాల షెడ్యూల్ ఇప్ప‌టికే చాలా పెద్దదైందని, ఆయ‌న భ‌విష్య‌త్తులో భారత్‌లో ప్రత్యేకంగా పర్యటిస్తారని అన్నారు.  

  • Loading...

More Telugu News