queen: 'క్వీన్' దక్షిణాది రీమేకుల్లో కీలక పాత్రల్లో నటించనున్న ఎల్లీ అవ్రాం, శిబానీ ధండేకర్
- మాతృకలో లీసా హెడెన్ పోషించిన పాత్రకు వీరి ఎంపిక
- ముందు అమీ జాక్సన్‌ను అనుకున్నారు
- కాల్షీట్లు కుదరకపోవడంతో అవకాశాన్ని కోల్పోయిన అమీ
'క్వీన్' హిందీ చిత్రం దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. మాతృకలో లీసా హెడెన్ పోషించిన పాత్రకు చాలా మంచి పేరు వచ్చింది. ఇప్పుడు దక్షిణాది రీమేకుల్లో ఆ పాత్ర కోసం ఎల్లీ అవ్రాం, శిబానీ ధండేకర్లను ఆయా చిత్రయూనిట్లు ఎంపిక చేశాయి. కన్నడ, తమిళ భాషల్లో ఎల్లీ అవ్రాం, తెలుగు, మలయాళ భాషల్లో శిబానీ ధండేకర్లు నటించనున్నట్లు నిర్మాత మను కుమారన్ తెలిపారు.
నిజానికి నాలుగు భాషల్లోనూ ఈ పాత్ర కోసం అమీ జాక్సన్ అయితే బాగుంటుందని చిత్ర బృందం ఆమెను కలిశారట. అయితే అమెరికన్ టీవీ సిరీస్ 'సూపర్‌గర్ల్'లో నటించే అవకాశం రావడంతో కాల్షీట్లు కుదరక అమీ ఈ అవకాశాన్ని వదులుకున్నట్లు తెలుస్తోంది. క్రికెట్ యాంకర్‌గా సుపరిచితురాలైన శిబానీ, హిందీ బిగ్‌బాస్ ద్వారా ప్రాచుర్యం సంపాదించుకున్న ఎల్లీలు లీసా హెడెన్ చేసిన పాత్రకు కొత్తదనం తీసుకువస్తారని మను కుమారన్ అన్నారు. ఈ చిత్రాల్లో కంగనా పాత్రలో తెలుగులో తమన్నా, తమిళంలో కాజల్, మలయాళంలో మంజిమా మోహన్, కన్నడలో పారుల్ యాదవ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.