revanth reddy: రేవంత్ కు పదవులు ఇవ్వద్దని నేనెందుకంటా?: డీకే అరుణ

  • ఎవరైనా నా పేరు చెబుతున్నారేమో
  • హైకమాండ్ నిర్ణయాన్ని ఎవరు కాదంటారు?
  • కొడంగల్ కు ఉపఎన్నిక వస్తుందనుకోను

కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి రాకను తానెందుకు అడ్డుకుంటానని మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ ప్రశ్నించారు. రేవంత్ ను వ్యతిరేకిస్తున్నవారు ఎవరైనా తన పేరు చెబుతున్నారేమోనని అన్నారు. హైకమాండ్ పదవులు ఇస్తే, వద్దు అనేవారు ఎవరుంటారని చెప్పారు. రేవంత్ నియోజకవర్గం కొడంగల్ కు ఉపఎన్నిక వస్తుందని తాను భావించడం లేదని తెలిపారు. ఒకవేళ కొడంగల్ కు ఉపఎన్నిక వస్తే... పార్టీలు ఫిరాయించిన ఎమ్మెల్యేలున్న అన్ని స్థానాల్లో ఉపఎన్నికలను నిర్వహించాలని అన్నారు. ఈరోజు అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 

revanth reddy
dk aruna
kodangal constituency
  • Loading...

More Telugu News