prakash raj: రజనీకాంత్, కమలహాసన్ లకు ఓటు వెయ్యను: ప్రకాష్ రాజ్

  • సినిమాల పరంగా వీరిని అభిమానిస్తా
  • ఇప్పట్లో రాజకీయాల్లోకి రాను
  • మోదీ నాకన్నా పెద్ద నటుడు

సినిమాలు, నటన పరంగా రజనీకాంత్, కమలహాసన్ లను తాను ఎంతో అభిమానిస్తానని... అయితే, వారు రాజకీయ పార్టీలు పెట్టి, పోటీ చేస్తే మాత్రం వారికి ఓటు వేయబోనని ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని చెప్పారు.

 అయితే రాజకీయాలు, ఇతర అంశాలపై తన స్పందనను తెలియజేస్తుంటానని తెలిపారు. మెర్సల్ సినిమా వివాదం నేపథ్యంలో హీరో విశాల్ ఇంటిపై జరిగిన ఐటీ దాడికి, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ తన కంటే పెద్ద నటుడని... తన వ్యాఖ్యల్లో ఎలాంటి సందేహం లేదని తెలిపారు. 

prakash raj
kamal haasan
rajanikanth
narendra modi
  • Loading...

More Telugu News