lakshmis ntr: అదే మాట! రామ్ గోపాల్ వర్మ చెప్పిందే.. 'లక్ష్మీస్ వీరగ్రంథం' డైరెక్టర్ కూడా చెప్పారు!

  • ఎన్టీఆర్ మీద ప్రేమతోనే సినిమా తీస్తున్నా
  • నాకు ఎవరి అండదండలు లేవు
  • నా వెనుక ఎన్టీఆర్ మాత్రమే ఉన్నారు

'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తీస్తున్నానంటూ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన కొన్ని రోజులకే... 'లక్ష్మీస్ వీరగ్రంథం' సినిమా తీస్తున్నానంటూ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ప్రకటించారు. అయితే, ఈ సినిమా వెనుక కొందరు రాజకీయ నేతలు ఉన్నారంటూ విమర్శలు కూడా వచ్చాయి. ఈ విమర్శలకు కేతిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. అన్న ఎన్టీఆర్ మీద ఉన్న ప్రేమతోనే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నానని ఆయన అన్నారు. ఈ విషయంలో తనకు ఏ పార్టీ అండదండలు లేవని... తన వెనుక ఉన్నది కేవలం ఎన్టీఆరే అని చెప్పారు. కథ సేకరణ కోసం గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పర్యటిస్తానని తెలిపారు.

'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను ప్రకటించిన తర్వాత వర్మ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఎన్టీఆర్ అంటే తనకు ఎంతో ప్రేమ అని... ఆయన ఆత్మ తన కలలోకి వచ్చి, తన చేత స్క్రీన్ ప్లే రాయిస్తోందని చెప్పిన సంగతి తెలిసిందే. 

lakshmis ntr
lakshmis veeragrandham
ketireddy
ramgopal varma
tollywood
  • Loading...

More Telugu News