child died: తినుబండారాల ప్యాకెట్‌లో వ‌చ్చిన ప్లాస్టిక్ బొమ్మ.. గొంతులో ఇరుక్కుని బాలుడి మృతి

  • పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని కుమ్మంరేవులో ఘ‌ట‌న‌
  • తినుబండారాల ప్యాకెట్‌లో వ‌చ్చిన ప్లాస్టిక్ బొమ్మ
  • ఊపిరాడ‌క ప్రాణాలు కోల్పోయిన నాలుగేళ్ల బాలుడు

ఆట వ‌స్తువు గొంతులో ఇరుక్కుని ఊపిరాడ‌క ఓ బాలుడు మృతి చెందిన ఘ‌ట‌న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో చోటు చేసుకుంది. కుమ్మంరేవు ప్రాంతంలో నాలుగేళ్ల బాలుడు నిరీక్ష‌ణ్ కుమార్‌.. తినుబండారాల (చిప్స్‌) ప్యాకెట్ కొనుక్కున్నాడు. అందులో ప్లాస్టిక్ బొమ్మ వ‌చ్చింది. పిల్ల‌ల‌ని ఆకర్షించేందుకు చిప్స్ ప్యాకెట్‌ల‌లో ఆట బొమ్మ‌లు పెట్టి విక్ర‌యిస్తున్నారు. అయితే, ఆ బొమ్మ‌ను కూడా తినుబండార‌మే అనుకున్నాడేమో ఆ బాలుడు దాన్ని మింగడానికి ప్ర‌య‌త్నించాడు.

అది గొంతులో ఇరుక్కోవ‌డంతో ఊపిరాడ‌లేదు. బాలుడి ప‌రిస్థితిని గ‌మ‌నించిన త‌ల్లిదండ్రులు వెంటనే ఆసుప‌త్రికి తరలించినా లాభం లేక‌పోయింది. ఆ బాలుడు చ‌నిపోయాడ‌ని వైద్యులు చెప్పారు.

  • Loading...

More Telugu News