revanth reddy: రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిన అనుచరులు.. 30 వాహనాల్లో హైదరాబాద్ పయనం!

  • టీఆర్ఎస్ లో చేరనున్న కోస్గి ఎంపీపీ, వైస్ ఎంపీపీ
  • ఈ సాయంత్రం టీఆర్ఎస్ లో చేరిక
  • రేవంత్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిని సారించిన టీఆర్ఎస్

తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్న రేవంత్ రెడ్డికి సొంత అనుచరులు షాక్ ఇచ్చారు. కోస్గి మండల పరిషత్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, ఉపాధ్యక్షుడు దోమ రాజేశ్వర్ లు టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో వీరు తమ అనుచరులతో కలసి 30 వాహనాల్లో హైదరాబాదుకు బయల్దేరారు. ఈ సాయంత్రం వీరు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ మంత్రులు హాజరవనున్నారు.

టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం గులాబీ ఆకర్ష్ కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా వివిధ పార్టీల నేతలను టీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ పై ప్రత్యేక దృష్టిని సారించింది. ఇప్పటికే రేవంత్ అనుచరులను కొందరిని పార్టీలో చేర్చుకుంది. ఇప్పుడు కోస్గి మండలానికి చెందిన ఎంపీపీ, వైస్ ఎంపీపీలు కూడా పార్టీలో చేరుతుండటంతో... రేవంత్ ఇలాఖాలో టీఆర్ఎస్ బలం మరింత పెరిగినట్టైంది. 

revanth reddy
kodangal constrituency
TRS
kosgi
  • Loading...

More Telugu News