ram gopal varma: రేవంత్ రెడ్డిపై కొత్త పోస్టర్లను పెట్టిన రామ్ గోపాల్ వర్మ!

  • రియల్ మెగాస్టార్ ఆఫ్ కాంగ్రెస్ అంటూ కామెంట్
  • బాస్ ఈజ్ హియర్ అంటూ ట్యాగ్ లైన్
  • ఫేస్ బుక్ లో వర్మ కొత్త పోస్టర్లు

వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దృష్ఠి ఇప్పుడు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై పడింది. టీడీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ పై వర్మ రెండు పోస్టర్లను ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశాడు. వీటికి 'రియల్ మెగాస్టార్ ఆఫ్ కాంగ్రెస్' అనే టైటిల్ పెట్టాడు. అంతేకాదు, 'బాస్ ఈజ్ హియర్' అంటూ ట్యాగ్ లైన్ కూడా జత చేశాడు. ఈ పోస్టర్ల కోసం చిరంజీవి 150వ సినిమా 'ఖైదీ నెంబర్ 150'కు చెందిన పోస్టర్లను మార్ఫింగ్ చేసి... చిరంజీవి తలకు బదులుగా రేవంత్ తలను ఉంచాడు.

ram gopal varma
revanth reddy
tollywood
congress
tTelugudesam
  • Loading...

More Telugu News