bihar: షాకింగ్... బీహార్ గుడిలో డస్ట్ బిన్ గా ఓ కంగారూ బొమ్మను పెడితే మహిళలు ఏం చేస్తున్నారో చూడండి!

  • ప్రజల మూఢ భక్తి    
  • గుడిలో చెత్తకుండీకి పూజలు
  • వైరల్ అవుతున్న వీడియో

ఇదొక షాకింగ్ వీడియో. భక్తిలో ప్రజలు ఎంత మూఢులుగా ప్రవర్తిస్తుంటారో తెలియజెపుతోంది. ప్రపంచంలో అత్యంత భక్తి భావాలున్న దేశం కూడా ఇండియానే. ఇక్కడ సూర్యుడి నుంచి ఆకాశం వరకూ, చెట్లు, పుట్టలు, పశు పక్ష్యాదులు కూడా ఏదో ఒక రూపంలో పూజలందుకుంటాయి. ఇప్పుడు తాజాగా ఓ డస్ట్ బిన్ కూడా పూజలు అందుకుంటోంది.

బీహార్ లోని ఓ గుడిలో కంగారూ బొమ్మ ఆకారంలోని చెత్త కుండీని ఉంచగా, అక్కడికి వచ్చిన మహిళలు దానికి పూజలు చేస్తుండగా, వీడియో తీసిన ఎవరో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. అదింక వైరల్ అయింది. డస్ట్ బిన్ కు పసుపు, కుంకాలు అద్ది, ఆపై చెత్త వేయాల్సిన చోట పూలు సమర్పిస్తూ, జలాభిషేకం చేసేస్తున్నారు. ఓ అభివృద్ధి చెందుతున్న దేశంగా ఇంకా ఇండియాలో ఇంత అమాయక పరిస్థితేంటని ట్విట్టరాటీలు ప్రశ్నిస్తున్నారు. ఆ వీడియోను మీరూ చూడండి.

bihar
dust bin
temple
  • Error fetching data: Network response was not ok

More Telugu News