google: ఉర్దూ ర‌చ‌యిత అబ్దుల్ ఖ‌వీ ద‌స్నావిని డూడుల్ రూపంలో గౌర‌వించిన గూగుల్‌

  • ఇవాళ అబ్దుల్ ఖ‌వీ ద‌స్నావి 87వ పుట్టిన రోజు
  • ఉర్దూ సాహిత్యాభివృద్ధికి ఎన‌లేని సేవ చేసిన ద‌స్నావి
  • పాత త‌రం ప్ర‌ముఖుల‌ను కొత్త త‌రానికి ప‌రిచ‌యం చేస్తున్న గూగుల్‌

ఇప్ప‌టి స్మార్ట్‌ఫోన్ యువ‌త‌రానికి పాత త‌రం ప్రముఖులు, వాళ్లు చేసిన కృషి గురించి పెద్ద‌గా తెలియదు. తెలుసుకోవ‌డానికి పెద్ద‌గా ఆసక్తి కూడా చూపించ‌రు. కానీ వారంద‌రినీ ప‌రిచ‌యం చేయడానికి సెర్చింజ‌న్ దిగ్గ‌జం గూగుల్ ప్ర‌య‌త్నిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఆయా ప్ర‌ముఖుల జ‌యంతికో, వ‌ర్ధంతికో డూడుల్ రూపంలో వారిని గుర్తుచేస్తోంది. రోజూ ఉద‌యాన్నే ఇంట‌ర్నెట్‌లో మొద‌ట ద‌ర్శ‌న‌మిచ్చే గూగుల్ డిజైన్‌లో డూడుల్ రూపంలో మార్పు క‌నిపిస్తుంది. ఆ డూడుల్ ఎందుకు పెట్టారో తెలుసుకునేందుకైనా నేటి యువ‌త‌రం దాని మీద క్లిక్ చేసి వివ‌రాల‌ను తెలుసుకుంటోంది.

ఈ నేప‌థ్యంలోనే ఇవాళ ప్రముఖ ఉర్దూ ర‌చ‌యిత అబ్దుల్ ఖ‌వీ ద‌స్నావిని డూడుల్ రూపంలో గూగుల్ గౌర‌వించింది. ఉర్దూ సాహిత్యాభివృద్ధికి ఎన‌లేని సేవ చేసిన ద‌స్నావినీ గూగుల్ న‌వ‌త‌రానికి మ‌ళ్లీ ప‌రిచ‌యం చేసింది. గూగుల్ అనే అక్ష‌రాల‌ను ఉర్దూలో రాసిన‌ట్లుగా చూపించింది. బిహార్‌లో దెస్నా గ్రామంలో 1930, న‌వంబ‌ర్ 1న జ‌న్మించిన ద‌స్నావి 'సాత్ తెహ్రీరెన్‌', 'మోటాల‌-ఈ-ఖుతూల్‌', 'గాలిబ్‌' వంటి ర‌చ‌న‌లు చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News