sudeep: 'ఈగ' ఫేం సుదీప్ కు నోటీసులు

  • సుదీప్, యాష్ లకు వాణిజ్యపన్నుల శాఖ నోటీసులు
  • ప్రొఫెషనల్ ట్యాక్స్ చెల్లించాలన్న అధికారులు
  • బకాయిలు చెల్లించిన కన్నడ స్టార్లు

కన్నడ సినీ స్టార్లు సుదీప్, యాష్ లకు బెంగళూరు వాణిజ్యపన్నుల శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. బకాయి ఉన్న ప్రొఫెషన్ ట్యాక్స్ చెల్లించాలంటూ నోటీసుల్లో ఆదేశాలు జారీ చేశారు. 'ఈగ' సినిమా ఫేం సుదీప్ కు 2011 నుంచి 2017 వరకు రూ. 33 వేలు చెల్లించాలంటూ నోటీసు ఇచ్చారు. మరో నటుడు యాష్ కు 2010 నుంచి 2017 వరకు రూ. 53 వేల ప్రొఫెషన్ ట్యాక్స్ చెల్లించాలంటూ నోటీసులు జారీ చేశారు. వాణిజ్యపన్నుల శాఖ నోటీసులకు వీరిద్దరూ వెంటనే స్పందించారు. తమ పన్ను బకాయిలను చెల్లించారు. 

sudeep
kichcha sudeep
hero yash
sandalwood
  • Loading...

More Telugu News