errabelli dayakar rao: సీతక్కను బతిమాలి.. కాళ్లు పట్టుకున్నారు: ఎర్రబెల్లి తీవ్ర వ్యాఖ్యలు

  • కాంగ్రెస్ లోకి వెళ్లడం సీతక్కకు ఇష్టం లేదు
  • టీఆర్ఎస్ లో చేరాలని అనుకున్నారు
  • త్వరలోనే కాంగ్రెస్ నుంచి బయటకు వస్తారు

రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శలు గుప్పించారు. రేవంత్ భార్య సోమవారం రాత్రి సీతక్క ఇంటికి వెళ్లి బతిమాలి, ఆమె కాళ్లను పట్టుకున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో సీతక్క ఇమడలేరని, త్వరలోనే ఆమె ఆ పార్టీ నుంచి బయటకు వస్తారని జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ లో చేరే విషయంపై తనతో సీతక్క మాట్లాడారని, కార్యకర్తలతో కూడా సమావేశం నిర్వహించారని తెలిపారు. అయితే, ఆమె టీఆర్ఎస్ లో చేరేలోపే రేవంత్ భార్య సీతక్క ఇంటికెళ్లి బతిమాలుకున్నారని... ఇష్టం లేకపోయినా కాంగ్రెస్ పార్టీలోకి సీతక్క చేరారని చెప్పారు. 

errabelli dayakar rao
TRS
revanth reddy
seethakka
tTelugudesam
congress
  • Loading...

More Telugu News