seethakka: సీతక్క టీడీపీకి గుడ్ బై చెప్పడం వెనుక ఇంత కథ నడిచింది!

  • సీతక్కతో చర్చలు జరిపిన రేవంత్ భార్య
  • రాత్రికి రాత్రే నిర్ణయం మార్చుకున్న సీతక్క
  • సీతక్క నిర్ణయంతో అవాక్కైన టీడీపీ కార్యకర్తలు

టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా వ్యవహరించిన రేవంత్ రెడ్డితో పాటు, సీతక్క, వేం నరేందర్ రెడ్డిలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వేం నరేందర్ టీడీపీని వీడుతారని అందరూ ఊహించిందే. అయితే, సీతక్క కూడా పార్టీని వీడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీని వెనుక హై డ్రామానే నడిచినట్టు సమాచారం.

వివరాల్లోకి వెళ్తే, రేవంత్ రెడ్డి సతీమణి నేరుగా హన్మకొండకు వెళ్లి సీతక్కను కలిశారు. ఆమెకు అన్నీ వివరించి, కాంగ్రెస్ లో చేరేలా ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో, రాత్రికి రాత్రే సీతక్క తన మనసు మార్చుకున్నారని, టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరాలనే నిర్ణయానికి వచ్చారని చెప్పుకుంటున్నారు.

అదే రాత్రి హైదరాబాద్ చేరుకున్న సీతక్క... తెల్లవారుజామున విమానంలో బయలుదేరి, ఢిల్లీ చేరుకున్నారు. అనంతరం రేవంత్ వర్గంతో కలసి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. సీతక్క నిర్ణయంతో టీడీపీ కార్యకర్తలు కూడా అవాక్కయ్యారని సమాచారం. 

seethakka
tTelugudesam
congress
revanth reddy
revanth reddy wife
rahul gandhi
  • Loading...

More Telugu News