Kazakhstan: ఇప్పుడు దేశాల వంతు.. పేరు మార్చుకోనున్న కజకిస్థాన్!
- లాటిన్ భాష నుంచి సిరిలిక్‌లోకి మార్పు
- 2025 నాటికి మారిపోనున్న పేరు
- కమిటీ ఏర్పాటు చేసిన కజక్ ప్రభుత్వం
మన దేశంలో రాష్ట్రాల, నగరాల పేరు మార్పు కొత్త కాదు. బెంగుళూరు బెంగళూరుగా, మద్రాసు చెన్నైగా, పశ్చిమబెంగాల్ పశ్చిమబంగగా, అస్సాం అసోంగా, గురుగావ్ గురుగ్రామ్‌గా.. ఇలా పేర్లు మార్చుకున్నాయి. ఇప్పుడు ఇదే బాటలో కజకిస్థాన్ కూడా నడుస్తోంది. 2025 నాటికి పేరును మార్చుకోవాలని యోచిస్తోంది. ఇందుకోసం ఓ కమిషన్‌ను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం కజకిస్థాన్‌గా వ్యవహరిస్తున్న ఆ దేశం పేరును ఇకపై ఖజక్‌స్థాన్‌గా మార్చాలని భావిస్తోంది. లాటిన్ భాష ఆధారంగా ఉన్న ఈ పేరును ఇకపై సిరిలిక్‌లోకి మార్చాలని నిర్ణయించింది.
రష్యా ప్రభావం నుంచి దూరంగా జరిగేందుకే కజకిస్థాన్ ఈ నిర్ణయం తీసుకుంది. 1940లో అప్పటి సోవియట్ యూనియన్ ప్రభుత్వం దేశంలో ప్రవేశపెట్టిన సిరిలిక్ భాషనే దేశంలో వినియోగిస్తున్నారు. ఈ లిపిలో మొత్తం 42 అక్షరాలుండగా అందులో 9 అక్షరాలు ఉచ్చరించేటప్పుడు కజక్ ధ్వని వినిపిస్తుంది.