ap: 2018 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెలవులివే!
- మొత్తం 19 సెలవులను ప్రకటించిన ఏపీ
- సెలవుదినాల్లో వచ్చిన మరో నాలుగు సెలవులు
- 19 ఐచ్ఛక సెలవులకు అవకాశం
వచ్చే సంవత్సరం సెలవుల జాబితాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. 19 సాధారణ సెలవులు, 20 ఐచ్ఛిక సెలవులను ప్రకటిస్తూ, సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. వీటిల్లో నాలుగు సాధారణ సెలవులు, నాలుగు ఐచ్ఛక సెలవులు రెండో శనివారం, ఆదివారాల్లో వచ్చాయి. సాధారణ సెలవుల జాబితా
సంక్రాంతి : జనవరి 15, సోమవారం
కనుమ: జనవరి 16, మంగళవారం
రిపబ్లిక్ డే: జనవరి 26, శుక్రవారం
మహాశివరాత్రి: ఫిబ్రవరి 13, మంగళవారం
హోలీ: మార్చి 2, శుక్రవారం
గుడ్ ఫ్రైడే: మార్చి 30, శుక్రవారం
బాబూ జగ్జీవన్ రామ్ జయంతి: ఏప్రిల్ 5, గురువారం
ఈద్ ఉల్ ఫితర్: మే 16, శనివారం
స్వాతంత్ర్య దినోత్సవం, ఆగస్టు 15, బుధవారం
బక్రీద్: ఆగస్టు 22, బుధవారం
శ్రీకృష్ణాష్టమి: సెప్టెంబర్ 3, సోమవారం
వినాయకచవితి: సెప్టెంబర్ 13, గురువారం
మొహర్రం: సెప్టెంబర్ 21, శుక్రవారం
గాంధీ జయంతి: అక్టోబర్ 2, మంగళవారం
దుర్గాష్టమి: అక్టోబర్ 17, బుధవారం
విజయదశమి: అక్టోబర్ 18, గురువారం
దీపావళి: నవంబర్ 7, బుధవారం
మిలాదున్ నబీ : నవంబర్ 21, బుధవారం
క్రిస్మస్: డిసెంబర్ 25, మంగళవారం
ఇవి కాకుండా సాధారణ సెలవుల్లో భోగి (జనవరి 14, ఆదివారం), ఉగాది (మార్చి 18, ఆదివారం), శ్రీరామనవమి (మార్చి 25, ఆదివారం), అంబేద్కర్ జయంతి (ఏప్రిల్ 14, శనివారం) సెలవు రోజుల్లో వచ్చాయి. ఐచ్ఛిత సెలువులుగా న్యూ ఇయర్, శ్రీపంచమి, హరజత్ మహ్మద్, జువన్ పరి జయంతి, మహావీర్ జయంతి, బసవ జయంతి, బుద్ధ పూర్ణిమ, సబ్-ఇ-బరాత్, షహాదత్ హజరత్ అలీ, సబ్-ఇ-కదిర్, జమ్మాతుల్ వద, పార్శీ న్యూ ఇయర్, వరలక్ష్మీ వ్రతం, ఈల్-ఇ-షుదీర్, 3వ మొహరం, మహాలయ అమావాస్య, అర్బయీన్, నరక చతుర్ధి, కార్తీక పౌర్ణమి / గురునానక్ జయండి, క్రిస్మస్ ఈవ్, బాక్సింగ్ డేలను ప్రకటించారు.