tTelugudesam: రేవంత్ రెడ్డి ఇలాఖాలో పార్టీ కార్యక్రమాలను అడిగి తెలుసుకున్న చంద్రబాబు

  • టీటీడీపీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
  • పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం
  • రేవంత్ మైండ్ గేమ్ ఆడుతున్నారన్న నేతలు

తెలంగాణ టీడీపీ నేతలతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అమరావతి నుంచి పార్టీ నేతలతో ఆయన మాట్లాడారు. ఇటీవలే టీడీపీకి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్ లో పార్టీ చేపట్టబోతున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా ఆయన అడిగి తెలుసుకున్నారు.

తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సందర్భంగా ఆయన దిశానిర్దేశం చేశారు. నాయకులంతా కలసి ఐకమత్యంతో ముందుకు సాగాలని ఆదేశించారు. మరోవైపు, ఈ సందర్భంగా టీటీడీపీ నేతలు మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నారంటూ చంద్రబాబుకు తెలిపారు.

tTelugudesam
chandrababu
ap cm
revant reddy
  • Loading...

More Telugu News